ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువులకూ అవకాశం

కరకగూడెంలో ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువులకూ అవకాశం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ సార్వత్రిక విద్యా విధానం (ఓపెన్ స్కూల్) ద్వారా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతుల కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

పాఠశాల విద్య మధ్యలో ఆపేసిన వారు లేదా రెగ్యులర్‌గా పాఠశాలలకు హాజరుకాలేని విద్యార్థుల కోసం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ లభిస్తుంది. ఇది ఉద్యోగాలకు మరియు ఉన్నత విద్యా అవకాశాలకు వర్తిస్తుంది.

అడ్మిషన్లకు అవసరమైన పత్రాలు:

పదవ తరగతి కోసం: టి.సీ., పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

ఇంటర్మీడియెట్ కోసం: పదవ తరగతి మార్కుల పట్టిక, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

విద్యార్థులు లేదా తల్లిదండ్రులు కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జి. మంజుల సంప్రదించవచ్చు.
ఫోన్ నెంబర్: 94911 04082

– కరకగూడెం మండల తెలంగాణ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్
జి. మంజుల
94911 04082

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్