ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ గిరిజన సంక్షేమ మిని గురుకులం బాలికల పాఠశాలలో ప్రవేశాలకి దరఖాస్తులు ఆహ్వానం

భద్రాచలం,ఆధాబ్ న్యూస్:

తెలంగాణ గిరిజన సంక్షేమ మినీ గురుకులం బాలికల పాఠశాల, పినపాక మండలంలో 2025-26 విద్యాసంవత్సరానికి 1వ తరగతి మరియు 2వ తరగతి, 5వ తరగతులలో మిగిలిన బ్యాకులాగ్ సీట్లకు ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రవేశాలకు అర్హత:
ప్రధానంగా పినపాక మండలానికి చెందిన స్థానిక గిరిజన విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానిక విద్యార్థినులు అందుబాటులో లేని పక్షంలో సమీప మండలాల గిరిజన విద్యార్థినులకు రెండవ ప్రాధాన్యత లభిస్తుంది.

ఖాళీల వివరాలు:

1వ తరగతి: 30 సీట్లు

2వ తరగతి: 1 సీటు

5వ తరగతి: 8 సీట్లు
మొత్తం ఖాళీలు: 39

దరఖాస్తుల సమర్పణ తేదీలు:
ఈ నెల 30వ తేది నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేయదలిచిన విద్యార్థినులు ప్రధానోపాద్యాయురాలు, మినీ గురుకులం, పినపాక వద్ద దరఖాస్తులు సమర్పించగలరు.

అవసరమైన పత్రాలు:

రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

అభ్యర్థి సంతకం

ఆధార్ కార్డు

పుట్టిన తేది వివరాలు

మొబైల్ నంబరు

ఎంపిక విధానం:
లాటరీ విధానంలో ఎంపిక జరుగుతుంది. పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యాబోధన ఇంగ్లీష్ మీడియంలో (CBSE సిలబస్) జరుగుతుంది.

వయోపరిమితి:
1వ తరగతిలో ప్రవేశానికి అభ్యర్థి వయస్సు 6 సంవత్సరాలు ఉండాలి.

అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన నంబర్లు:
📞 9701495907, 7702652708

–– అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్