ప్రతి క్షణం
ప్రజల పక్షం

  హనుమాన్ జయంతి సందర్భంగా మణుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పోలీసు అధికారులు

హనుమాన్ జయంతి సందర్భంగా మణుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పోలీసు అధికారులు.
మణుగూరు ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నేడు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మణుగూరు పోలీసు శాఖ అధికారులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇంచార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మేడాప్రసాద్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అధికారులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని వారు భక్తులకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్