ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్‌లో పోలీసుల మాక్ డ్రిల్

అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్‌లో పోలీసుల మాక్ డ్రిల్.
అత్యవసర పరిస్థితుల్లో స్పందనపై సిబ్బందికి అవగాహన.

భద్రాద్రి కొత్తగూడెం,మే 11 ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలోని హెవీ వాటర్ ప్లాంట్‌లో శనివారం (మే 10) మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రిల్ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో, ప్రమాదకర పరిస్థితుల్లో స్పందన ఎలా ఉండాలన్న విషయంపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆకస్మిక దాడులు లేదా ఇతర అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్లాంట్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వివరించారు. అలారం సిస్టమ్ వినిపించినప్పుడు పాటించవలసిన నియమాలపై స్పష్టతనిచ్చారు.

మాక్ డ్రిల్‌లో సీఐఎస్ఎఫ్ కమాండెంట్ అమిత్ కుమార్, మణుగూరు ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ జి. అశోక్, ఎస్‌ఐ మధు ప్రసాద్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!