ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా రూ. 3.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా రూ. 3.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మణుగూరు,ఆధాబ్,న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 8 మంది లబ్ధిదారులకు రూ. 3.50 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. ఈ చెక్కులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, అలాగే కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్