ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాకలో పర్యటించిన మంత్రి పొంగులేటి – గొట్టెల్లలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

పినపాకలో పర్యటించిన మంత్రి పొంగులేటి – గొట్టెల్లలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

పినపాక, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాన్ని రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని గొట్టెల్ల గ్రామంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు స్థిర నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మౌలిక వసతులు కల్పించి గ్రామీణ అభివృద్ధికి నిదర్శనంగా నిలబడుతామని చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్