రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. విజయవంతం చేయండి మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రేపు సోమవారం (05-05-2025) కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం, తాటిగూడెం, వెంకటాపురం, వట్టం వారి గుంపు, చిరుమళ్ళ గ్రామాల్లో పర్యటించనున్నాడు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నాడు.
పర్యటన షెడ్యూలు ఇలా
ఉదయం 8:30 గంటలకు – రఘునాథపాలెంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం, అనంతరం సమీక్ష సమావేశం.
తాటిగూడెం, వెంకటాపురం, వట్టం వారి గుంపు, చిరుమళ్ళ గ్రామాల్లో నిర్మితమైన నూతన సిసిరోడ్ల ప్రారంభోత్సవాలు.
ఈ పర్యటన ద్వారా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి, స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పిలుపునిచ్చాడు.









