అశ్వాపురంలో కల్యాణలక్ష్మి & సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు కల్యాణలక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అశ్వాపురం మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ. 16,01,856 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, అలాగే 31 మంది సిఎంఆర్ఎఫ లబ్ధిదారులకు రూ. 12,30,000 చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ పాయం వెంకటేశ్వర్లు, “కాంగ్రెస్ పేదల ప్రభుత్వంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు అందిస్తున్నది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఇవే అండగా నిలుస్తాయి,” అని తెలిపారు.
చెక్కులు పొందిన కుటుంబాలకు ఈ నిధులను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. అలాగే ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో కొంత భరోసా కలిగిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎమ్మార్వో స్వర్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, మండల కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









