ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కార్మికుల శక్తిని ఏకం చేసిన మేడే కరకగూడెంలో జెండా ఆవిష్కరణలు.

కార్మికుల శక్తిని ఏకం చేసిన మేడే కరకగూడెంలో జెండా ఆవిష్కరణలు.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని కరకగూడెం మండలంలో ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యూదుల స్మృతిని స్మరించుకుంటూ, పలుచోట్ల జెండా ఆవిష్కరణలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి వంగరి సతీష్, సహాయ కార్యదర్శి బోడ ముత్తయ్య, బుడగం సతీష్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, వారి హక్కుల సాధనకై అందరూ ఐక్యంగా ముందడుగు వేయాలని నేతలు పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాలు శాంతియుతంగా ముగిశాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!