కరకగూడెంలో ఆదివాసీ పిల్లలకు దుస్తుల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) కరకగూడెం శాఖ ఆధ్వర్యంలో బుధవారం రేగళ్ల పంచాయతీ పరిధిలోని మదన గుంపులో 20 మంది ఆదివాసీ పిల్లలకు ఉచిత దుస్తులు పంపిణీ చేశారు.
ఈ దుస్తులను బ్యాంక్ మేనేజర్ గిరిబాబు స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ చిట్టిబాబు, నగదు చెల్లింపు అధికారి బొల్లికొండ రాకేష్, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
సామాజిక బాధ్యతలో భాగంగా ఆదివాసీ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. గ్రామస్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post Views: 151









