ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో రేపు విద్యుత్ అంతరాయం

మరమ్మత్తుల కారణంగా వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిపివేత

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలానికి చెందిన విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన ముఖ్య సమాచారం. రేపు బుధవారం (30-04-2025) ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు 33/11 కె.వి. కరకగూడెం ఉపకేంద్రంలో 33 కె.వి. కరకగూడెం లైన్‌పై నిర్వహించబోయే మరమ్మత్తు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏఈ నరేందర్ రెడ్డి తెలిపారు

ఈ వ్యవధిలో కరకగూడెం మండలంలో సింగిల్ ఫేస్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. వ్యవసాయ మోటార్లకు సరఫరా పూర్తిగా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరమ్మత్తులు పూర్తి అయిన వెంటనే పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని వారు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్