ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఖమ్మం పోలీస్‌ శాఖలో ఎస్‌ఐల అటాచ్మెంట్‌ ఉత్తర్వు

ఖమ్మం పోలీస్‌ శాఖలో ఎస్‌ఐల అటాచ్మెంట్‌ ఉత్తర్వులు.

ఖమ్మం, ఆధాబ్ న్యూస్ : ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలను బదిలీలో భాగంగా స్టేషన్లకు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు కమిషనర్ ఆదేశాల ప్రకారం నాలుగు మంది ఎస్‌ఐలను నూతన బాధ్యతలతో నియమించారు. వారు:

1. పీ. వెంకన్న – ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను బోనకల్‌ స్టేషన్‌కు ఎస్‌హెచ్ఓగా అటాచ్ చేశారు.

2. కె. మధు బాబు – బోనకల్ ఎస్‌హెచ్ఓగా ఉన్న ఆయనను CAR ఖమ్మానికి బదిలీ చేశారు.

3. ఎం. రమేష్ కుమార్ – ఖమ్మం-3 టౌన్‌ స్టేషన్‌ నుండి యెర్రుపాలెం స్టేషన్‌కు ఎస్‌హెచ్ఓగా అటాచ్ అయ్యారు.

4. పీ. వెంకటేష్ – యెర్రుపాలెం స్టేషన్‌ నుండి CAR ఖమ్మానికి బదిలీ అయ్యారు.

బదిలీ అయిన ఎస్‌ఐలు వెంటనే తమ కొత్త పోస్టింగ్‌ లొకేషన్లకు హాజరై విధులు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత పోలీస్ అధికారులు వీరిని వెంటనే రిలీవ్ చేసి, డ్యూటీలో చేరిన తేదీని కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్