ప్రతి క్షణం
ప్రజల పక్షం

  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం: 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది

ఆధాబ్ న్యూస్ ,నల్గొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం పవర్‌ ప్లాంట్‌ యొక్క మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్‌ లీక్‌ అవడంతో ఆ సమయంలో కింద వెల్డింగ్‌ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు మొత్తం యూనిట్‌ వరకు వ్యాపించడంతో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్‌ రన్‌ ప్రారంభానికి సిద్ధమైనప్పుడు ఈ ప్రమాదం జరిగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్