మానవతా హృదయాలు స్పందించండి – ఊపిరితిత్తుల వ్యాధితో పోరాడుతున్న యువకుడికి తోచిన సాయం చేయండి
పెద్దపల్లి, ఆదాబ్ న్యూస్ :
పెద్దపల్లి జిల్లా రామగుండం మూడో డివిజన్ న్యూ పోరటపల్లెకు చెందిన అంజిబాబు (28) గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులలో చేరిన నీరు తొలగించేందుకు వైద్యులు పైపు ద్వారా చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న డబ్బులతో కొంతవరకూ చికిత్స సాగింది. కానీ కటిక పేదరికం కారణంగా ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్లే స్థితిలో కూడా కుటుంబం లేదు.
స్వరాజ్యం కోసం పోరాడే సమాజంలో, ఒక ప్రాణం నిలుపుకోవడమే అసలైన మానవతా ధర్మం. గర్భవతిగా ఉన్న భార్య ఏడుపులతో భర్త ప్రాణాలను రక్షించమంటూ వేడుకుంటున్నారు. ఈ సంక్షోభ సమయంలో, దాతలు, మానవతావాదులు ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేయాలని సమీక్షిస్తున్నాము.
సాయం చేయదలచిన వారు దిగువ వివరాలకు సంప్రదించగలరు:
సమతా ఫౌండేషన్
Phone/Google Pay: 9493333899
ప్రతి రూపాయి ఒక్క ప్రాణాన్ని నిలుపుతుంది. మీరు చేయగల చిన్న సహాయం ఒక కుటుంబాన్ని వెలుగు చూస్తుంది.









