ప్రతి క్షణం
ప్రజల పక్షం

  స్పీడ్ బ్రేకర్ల తొలగింపునకు స్పందనకు వందనం: కర్నే బాబురావు కృతజ్ఞతలు.

స్పీడ్ బ్రేకర్ల తొలగింపునకు స్పందనకు వందనం: కర్నే బాబురావు కృతజ్ఞతలు.
మణుగూరు, ఆధాబ్ న్యూస్
సమితి సింగారం పంచాయతీ పరిధిలోని పివి కాలనీ రోడ్డులో ఏర్పాటైన ప్రమాదకర స్పీడ్ బ్రేకర్లను అధికారులు తొలగించిన నేపథ్యంలో కర్నే బాబురావు కృతజ్ఞతలు తెలిపారు.
వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ బ్రేకర్ల కారణంగా పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని బాబురావు తెలిపారు. ఈ సమస్యపై వారు చేసిన విజ్ఞప్తికి పంచాయతీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించడం పట్ల ఆయన “స్పందనకు వందనం” అంటూ స్పందించారు.

వాహనాల వేగాన్ని నియంత్రించాలనుకుంటే అధికారులు బారికేడ్స్ గానీ, స్ట్రిప్స్ గానీ ఏర్పాటు చేయాలని, అలాగే తగిన హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలని సూచించారు.

ఇక, పివి కాలనీ నుంచి కూనవరం రైల్వే గేట్ దాకా రోడ్డుకు మధ్యలో డివైడర్ ఏర్పాటుకు జెసిబి సహాయంతో గీతలు గీసినప్పటి నుంచి కూడా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. గీతల మధ్యలో టైర్ వెళ్లినపుడు వాహనం అదుపుతప్పి పక్కకు లాగబడుతోందని, దీంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఆ గీతలను పూడ్చి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!