ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆదివాసి చిరు ఉద్యోగులపై వేధింపులు తగదు: జేఏసీ అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర.

ఆదివాసి చిరు ఉద్యోగులపై వేధింపులు తగదు:
జేఏసీ అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర. పినపాక,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఆదివాసి చిరు ఉద్యోగులు, లంబాడి మరియు గిరిజనేతరుల వేధింపులకు గురవుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా జేఏసీ అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి వేధింపులు మరిన్ని అభివృద్ధి పనులకు అడుగడుగున అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. చిరు ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, కొంతమంది అధికారి స్థాయి ఉద్యోగుల నుంచి అప్రాసక్తమైన ఒత్తిళ్లు, వివక్ష చూపే విధంగా ఆదేశాలు వస్తున్నాయని ఆరోపించారు.

“ఇది సరికాదని, ప్రతి ఉద్యోగికి సమాన హక్కులు కలవు. ఉద్యోగ బాధ్యతలు నిర్విరామంగా కొనసాగించేందుకు అందరి సహకారం అవసరం,” అని ఆయన పేర్కొన్నారు.

ఇటువంటి వేధింపులు ఆపకపోతే, జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, తద్వారా తగిన న్యాయం పొందే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆదివాసి ఉద్యోగులపై జరిగే ఏవైనా అన్యాయాలను మరింత తీవ్రంగా సమీక్షించి, అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్