జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిపై మంత్రి సీతక్క ఖండించారు.
ఆధాబ్ న్యూస్, హైదరాబాద్:
జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని మంత్రి సీతక్క ఖండించారు. ఈ దాడిని ఆమె “దుర్మార్గపు చర్య”గా అభివర్ణించారు. “ఎలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని చంపడం అమానవీయం,” అని ఆమె పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతమూ ఉపదేశించదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఉగ్రదాడిలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు.
Post Views: 127









