ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వేసవి సెలవుల్లో విద్యార్థుల రైటింగ్ స్కిల్స్ అభివృద్ధికి నోట్ బుక్స్ పంపిణీ.

వేసవి సెలవుల్లో విద్యార్థుల రైటింగ్ స్కిల్స్ అభివృద్ధికి నోట్ బుక్స్ పంపిణీ.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో విద్యార్థుల రైటింగ్ నైపుణ్యాల అభివృద్ధికి జిల్లా కలెక్టర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో వేసవి సెలవుల్లో ఉపయోగించేందుకు 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు ITC సంస్థ సహకారంతో డబల్ రూల్ నోట్ బుక్స్ పంపించారు. ఈ నోట్ బుక్స్‌ను మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఈఓ ఆఫీస్) ద్వారా మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జి మంజుల మాట్లాడుతూ “మండలంలోని 25 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5వ తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఈ నోట్ బుక్స్‌ను విద్యార్థులకు అందించి, వేసవి సెలవుల్లో రైటింగ్ స్కిల్ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!