ప్రతి క్షణం
ప్రజల పక్షం

  హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అగ్నిప్రమాదం – మంత్రి పొంగులేటికి తృటిలో ప్రమాదం తప్పింది

హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అగ్నిప్రమాదం – మంత్రి పొంగులేటికి తృటిలో ప్రమాదం తప్పింది
ఆధాబ్ న్యూస్, నాగర్ కర్నూల్ :
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. భూ భారతి చట్టం–2025 అవగాహన సదస్సులో పాల్గొనేందుకు ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా వచ్చారు. మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్‌లో కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ల్యాండింగ్ సమయంలో సిగ్నల్ ఇవ్వడానికి బుల్లెట్ ఫైర్ చేయగా, అది కింద ఉన్న పొలంపై పడటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో హెలికాప్టర్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. చివరికి పెద్ద ప్రమాదం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!