కరకగూడెం మండలంలో రేపు మూడు గంటలు విద్యుత్ అంతరాయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్
కరకగూడెం మండలంలోని విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక. రేపు గురువారం, తేదీ 17/04/2025 న 33/11 కేవి కరకగూడెం ఉపకేంద్రంలో నిర్వహించనున్న మరమ్మత్తుల పనుల నేపథ్యంలో మండల మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
విద్యుత్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 33KV కరకగూడెం లైన్‌పై చెట్టు కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కారణంగా ఉదయం 8:00 గంటల నుండి 11:00 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉండదు.
ఈ సమయంలో వినియోగదారులు సహకరించాలని, అసౌకర్యానికి చింతిస్తున్నామని కరకగూడెం అసిస్టెంట్ ఇంజనీర్, నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Post Views: 147









