ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.

కరకగూడెంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ ఏప్రిల్ 14: కరకగూడెం మండల కేంద్రంలో బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు జిమ్మిడి ప్రకాష్, రాష్ట్ర నాయకులు జాడి నాగరాజు నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ వేడుకలో ప్రసంగించిన నాయకులు మాట్లాడుతూ డా. అంబేద్కర్ కుల, మత, లింగ, వర్గ భేదాలు లేకుండా ప్రతీ వ్యక్తికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాతగా, అఖండ భారత దేశానికి అద్భుతమైన దిశానిర్దేశం చేసిన విశ్వ మేధావిగా కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి సొత్తు కాదని, ఆయన రచించిన రాజ్యాంగం అందరి హక్కుల పరిరక్షణకు నాంది పలికిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రామటెంకి పూర్ణ చంద్రశేఖర్, గోగు వెంకటేశ్వర్లు, రామటెంకి హనుమంతరావు, జాడి సంజీవ, గాంధర్ల సతీష్, జాడి రామనాథం, గోగు సాంబశివరావు, రామటెంకి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!