కరకగూడెం ఎస్సైగా పీ.వీ. నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా పి.వి. నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించిన రాజేందర్ బదిలీపై టేకులపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
ఈ సందర్భంగా ఎస్ఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని, శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు పనిచేస్తానని తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నూతన ఎస్సైకి పోలీసు సిబ్బంది, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 52









