ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన ఐటీడీఏ పీఓ రాహుల్ – ఆసుపత్రిలోని పరిస్థితులను సమీక్షించిన అధికారి

మణుగూరు 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన ఐటీడీఏ పీఓ రాహుల్ – ఆసుపత్రిలోని పరిస్థితులను సమీక్షించిన అధికారి
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) రాహుల్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమీక్షిస్తూ, రోగుల స్థితిగతులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను పిలిపించి ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని బెడ్లు ఉన్నాయో, వాటిలో ఎంతమంది రోగులు ఉన్నారో, ఏవేవి వ్యాధులతో రోగులు చేరినారో వంటి వివరాలను సమీక్షించారు.
అంతేకాకుండా, ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల పనితీరు గురించి పీఓ రాహుల్ విచారణ జరిపారు. రోగులకు చికిత్సకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని తెలుసుకునేందుకు వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు.
అలాగే ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజన సౌకర్యం, నాణ్యత గురించి పీఓ రాహుల్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోగుల నుంచి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ, తాము పొందుతున్న సేవలపై సంతృప్తిగా ఉన్నారా? లేక ఏవైనా సమస్యలున్నాయా? అనే ప్రశ్నలు వేశారు.
ఈ సందర్శన అనంతరం పీఓ రాహుల్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతోనే ఈ విపులంగా సమీక్షిస్తున్నాం. అవసరమైతే మరింత మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ సందర్శనలో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!