భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద వాహన తనిఖీలు: ఎస్సై రాజ్ కుమార్
పినపాక,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి జిల్లాలోని పినపాక మండలం ఏడూల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ మంగళవారం సాయంత్రం సమయంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (BTPP) వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, వాహన పత్రాలు ఖచ్చితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్సై రాజ్ కుమార్ మాట్లాడుతూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపిన వారిని పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు తోడ్పడాలన్నారు.
Post Views: 108









