కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని కరకగూడెం మండలం మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. కాసు వెంకట్ రాజు జ్ఞాపకార్థంగా ఆయన కొడుకు సంజీవరాజు ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలకు చల్లని నీరు అందించడం ఎంతో మంచిది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, మహిళా నాయకురాలు పోలబోయిన శ్రీవాణి, రాందాస్ నాయక్, ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు









