కరకగూడెం,ఆధాబ్ న్యూస్
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండలంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాయం లక్ష్మీనారాయణ, చందా రాఘవులు, పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు వీసం సత్యనారాయణ, గుండ్ల కళ్యాణ్, సిరిశెట్టి సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. పార్టీకి కట్టుబడి పనిచేసేలా ప్రతిజ్ఞ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆదర్శాలను కొనసాగించేందుకు నాయకత్వం అందిస్తున్న నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ, పార్టీ ప్రజల కోసం చేస్తున్న సేవలను ప్రశంసించారు.
Post Views: 36









