కరకగూడెం,ఆధాబ్ న్యూస్: యువత ఈజీ డబ్బులకు అలవాటు పడి బెట్టింగ్‌లకు మొగ్గుచూపకూడదని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ సూచించారు. ఆయన యువతను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నేపథ్యంలో బెట్టింగ్‌కు పాల్పడుతూ భారీగా డబ్బులు కోల్పోతున్నారని గుర్తు చేశారు.
బెట్టింగ్ మాయాజాలం:
“ఒక్కరు డబ్బులు గెలుచుకున్నారని విన్న సంతోషంతో మీరు కూడా ఆ వలలో చిక్కుకోవద్దు” అని ఎస్ఐ రాజేందర్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఈజీ మనీ ఆశతో బెట్టింగ్‌లలో మునిగితే అందుకు చేదు ఫలితాలే ఎదురవుతాయని తెలిపారు.
పెద్దల బాధ్యత:
ఇలాంటి ఘటనలు మండల పరిధిలో జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పిల్లల అవసరాలకు మించి డబ్బులు ఇవ్వకూడదని, వారిలో ఆర్థిక బాధ్యతను పెంపొందించాలని ఆయన కోరారు.
కుటుంబాలపై ప్రభావం:
“బెట్టింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. కొందరు జీవితాలను కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి” అని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.









