ఎస్సై రాజేందర్ సహాయంతో జుగుణమ్మకు న్యాయం.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగుణమ్మ అకౌంట్ నుంచి పొరపాటున వేరే అకౌంట్‌లో జమచేసిన రూ.28,000లను తిరిగి పొందడంలో ఎస్సై రాజేందర్ సహాయంతో న్యాయం పొందారు.
తప్పుగా జరిగిన లావాదేవీ వల్ల తీవ్రంగా బాధపడుతున్న జుగుణమ్మ గత కొన్ని రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ డబ్బులు తిరిగి పొందేందుకు ప్రయత్నించారు. చివరికి, ఆశాభావంతో కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
జుగుణమ్మ సమస్యను కరోణంగా తీసుకున్న ఎస్సై రాజేందర్ తక్షణమే స్పందించారు. సంబంధిత బ్యాంకు అధికారులతో సమన్వయం చేసి, డబ్బులు ఎవరి ఖాతాలో జమ అయ్యాయో గుర్తించారు. ఎస్‌ఐ చొరవతో కేవలం రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కరించి జుగుణమ్మ ఖాతాలో రూ.28,000ను తిరిగి జమ చేయించారు.
తన ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికిన ఎస్సై రాజేందర్ కు జుగుణమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో ఎస్సై చూపిన బాధ్యత ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింతగా పెంచింది.
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఎస్సై రాజేందర్ చేపట్టిన ఈ చర్య, బాధితులకు ఆశాజ్యోతి నింపింది.









