హైదరాబాద్, ఆధాబ్ న్యూస్
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, అంగన్వాడి కేంద్రాలను పాఠశాలల మాదిరిగానే ఒంటి పూట నిర్వహించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం, శనివారం నుంచి అంగన్వాడి కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు మాత్రమే నిర్వహించనున్నారు.
ఈ నిర్ణయం చిన్నపిల్లలు మరియు గర్భిణీ, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు .
Post Views: 42









