విజేతలకు బహుమతులు ప్రధానం.
ఆధాబ్ న్యూస్,కరకగూడెం:
చొప్పాల ముసలమ్మ తల్లి
జాతర సందర్భంగా భద్రాద్రి,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో శుక్రవారం జరిగిన పోటీలో చొప్పాల జట్టు పై చింతకుంట జట్టు,కామారం జట్టు పై కొత్తగూడెం జట్టు గెలిచి ఫైనల్స్ కు దూసుకెళ్లిపోయారు.అనంతరం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చింతకుంట,కొత్తగూడెం జట్ల మధ్య హోరా హోరీగా జరిగింది.ఎవరు గెలుస్తారో క్రీడాకారులు,ప్రజలు మధ్య ఆసక్తికరంగా వీక్షించారు.చివర్లో చింతకుంట జట్టు,కొత్తగూడెం జట్టుపై విజయం సాధించి టోర్నమెంటు విజేతగా నిలిచింది.విజేతలకు కొమరం వెంకటనారాయణ,అత్తె నాగేశ్వరరావు,కొమ్మ వరప్రసాద్,తోలెం వీరయ్య,అయ్యోరి వెంకటేశ్వర్లు తదితరులు బహుమతులు అందజేశారు.రెండవ బహుమతి జాడి మాధవరావు అందజేసినందుకు వివేకానంద యూత్ వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముసలమ్మ తల్లి కమిటీ సభ్యులు,యూత్ సభ్యులు పాల్గొన్నారు.









