ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 108 EMT దోమల ప్రణయ్ కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం అందజేత.

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో 108 అంబులెన్స్ లో EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)గా విధులు నిర్వహిస్తున్న దోమల ప్రణయ్ గత డిసెంబర్ 13న అకాల మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ అతని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
తెలంగాణ 108 స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్ తెలిపిన వివరాల ప్రకారం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు సంస్థ తరఫున ₹5 లక్షల పరిహారం అందజేస్తారని తెలిపారు. ఈ మొత్తం ఉద్యోగస్తుల నామినీకి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, తాజాగా EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ముఖ్య కార్యాలయంలో దోమల ప్రణయ్ కుటుంబ సభ్యులకు ₹5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హెడ్ ఆపరేషన్స్ MA ఖాలీద్ , హెచ్ ఆర్ హెడ్ కిరణ్ కిషోర్ పాల్గొని చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్