కరకగూడెం, ఆధాబ్, న్యూస్: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6500 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు విడుదల చేయాలని రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో గురుకుల మరియు ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలకు సొంత భవనాల నిర్మించాలని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచేలా చర్యలు తీసుకొని, ఆశ్రమ పాఠశాలలో ఇతర వసతి గృహాల్లో సక్రమంగా మెనూ అమలయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ నియంత్రించి ఫీజులను నియంత్రించాలని కోరుతూ వివిధ డిమాండ్స్ ఉన్న వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు









