ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: ప్రేమతో నిండిన హృదయమే నిజమైన సంపదని కరకగూడెం ఎస్సై రాజేందర్ అన్నారు. మంగళవారం అంగోరుగూడెం వలస ఆదివాసీ గ్రామంలో ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై రాజేందర్ వలస ఆదివాసీ కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగి ఉందని, ప్రతిఒక్కరూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అన్నారు.
ఫౌండేషన్ సభ్యులు ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.









