కరకగూడెం, ఆధాబ్,న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కరకగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ గుడి దగ్గర పేకాట జరుగుతోందన్న సమాచారంతో కరకగూడెం ఎస్సై తన సిబ్బందితో ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
ఈ దాడిలో నాలుగు సెల్‌ఫోన్లు, ఐదు బైకులు, రూ. 7,500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు .
Post Views: 277









