ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీతారామపురం శివారులో పోలీస్ శాఖ తనిఖీలు.

సీతారామపురం శివారులో పోలీస్ శాఖ తనిఖీలు.
కరకగూడెం ఆధాబ్,న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలోని సీతారాంపురం శివారులోనీ ఎస్‌ఐ రాజేందర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండడం వంటి అంశాలపై వివరంగా సూచనలు ఇచ్చారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి. హెల్మెట్ లేకపోవడం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని, ప్రతి రైడర్ సురక్షితంగా ఉండేందుకు ఇది అవసరమని వివరించారు.
కేవలం హెల్మెట్ ధరించడం మాత్రమే కాదు, డ్రైవింగ్ లైసెన్సు ఉండటమూ ఎంతో ముఖ్యమని తెలిపారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సహకరించాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!