మానవత్వం చాటుకున్న వర్క్ ఇన్స్పెక్టర్ సింగారయ్య
ఆధాబ్ న్యూస్, పినపాక:
పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన పూస వెంకటేష్ ఇల్లుకు అగ్నిప్రమాదం సంభవించి కాలి పోయింది విషయం తెలుసుకున్న ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్, శ్రీ జై సాయి బుక్ స్టాల్ (బయ్యారం క్రాస్ రోడ్) నిర్వాహకులు మంగళగిరి సింగారయ్య మానవత్వం చాటుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఆయన 25 కేజీల బియ్యం అందజేశారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సమాజ సేవకులు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి తమకు తోచిన ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన స్థానికులు కూడా తమ సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు.
Post Views: 59









