ఆధాబ్ న్యూస్,కరకగూడెం: ఎస్సీ వర్గీకరణలో నేతకానిలకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ శమీం అక్తర్ సమర్పించిన రిపోర్టులో నేతకానిలను మాల సామాజిక వర్గంలో అత్యధిక అభివృద్ధి చెందిన కులాలుగా గుర్తించి గ్రూప్-3లో చేర్చారని తెలిపారు.
నేతకాని సామాజిక వర్గాన్ని మాల కులాలకు సంబంధం లేకుండా వేరు చేసి, మరికొన్ని వెనుకబడిన కులాలతో కలిపి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జిమ్మిడి ప్రకాష్, ములుగు జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బాడిశ సువాష్, భద్రాద్రి జిల్లా యూత్ లీడర్ గోగు సాయి, జాడి దినేష్, జాడి వంశీ తదితరులు పాల్గొన్నారు.









