సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ . రవీందర్ రెడ్డి.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ రాజేందర్, ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్, పంచాయితీ అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చతిస్గడ్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ బందోబస్తును పటిష్ఠంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, అత్యవసర సేవలు తదితర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
అధికారులు గ్రామ పెద్దలతో చర్చించి, అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరను శాంతియుతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.









