ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆదిమ జాతి కోయల ఇలవేల్పు సమ్మక్క సారలమ్మ జాతరకు పోదాం రండి.. కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారమై నిలిచిన ఆదిపరాశక్తి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయగలరు-ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలెబోయిన వెంకటనారాయణ.

 

కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :
ఆదివాసి మహిళా ఆదిపరాశక్తి
శ్రీ సమ్మక్క శ్రీ పగిడిద్దరాజు కళ్యాణం(వివాహం)
తేది: 13/02/2025 గురువారం రాత్రి 12:30 నిమిషములకు జరుగును ఆరోజు నిండు జాతర
శ్రీ సమ్మక్క తల్లిని చిరుమల్ల దండకారణ్యంలో ఉన్న ముసలమ్మ (చిలకల) గుట్ట నుండి అంగరంగ వైభవాలతో వనదేవతలను కలుపుకొని ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలతో…
కళాబృంద నృత్యాలతో.దేవతల పూనకాల కోలాహలములతో. చిరుమళ్ళ గ్రామంలోని శ్రీ సమ్మక్క-సారలమ్మ తల్లులను గద్దెల మీదికి తీసుకొనివస్తారు.అంతకు ముందు రోజు అనగా తేదీ : 12/02/ 2025 (బుధవారం) రోజు రాత్రికే శ్రీ సమ్మక్క శ్రీ పగిడిద్దరాజు గార్ల కళ్యాణం కోసం సర్వదేవతలు, ఇలవేల్పులు శ్రీ సమ్మక్క పగిడిద్దరాజు వేల్పులు చిరిమల్ల గ్రామం చేరి గద్దెల దగ్గర వున్న కళ్యాణ మండపం వద్ద ఆశీనులై ఉంటారు.శ్రీ సమ్మక్క తల్లి శ్రీ చంద వారి వంశంలో
ఆనాటి కాకతీయుల కాలంలో జన్మించినది
పగిడిద్ద రాజుతో పెళ్లి(కళ్యాణం) జరిగిన తర్వాత శ్రీ సమ్మక్క తల్లికి ఒకే ఒక్క కూతురు శ్రీ సారలమ్మ(సారక్క) జన్మించినది. తల్లి కూతురు కలిసి చిరుమళ్ల గ్రామం నుండి బయక్క పేట గ్రామంనకు కొంతమంది చంద వంశీయులతో కలిసి వెళ్ళినారు. ఆ తరువాత మేడారం గ్రామం వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని స్థిరపడినారు మేడారం గ్రామం నుండి శ్రీ సమ్మక్క సారలమ్మలు భక్తులకు, సర్వజనులకు ఆశీస్సులు అందజేయుచున్నారు. శ్రీ సమ్మక్క తల్లి సూచనల ప్రకారం ఒక్క సంవత్సరం చిరుమల్ల గ్రామంలో ఉన్న చందా వంశీయులు మరొక సంవత్సరం బయక్క పేటలో (మేడారం) లో ఉన్న చందా వంశీయులు తన కళ్యాణం మాఘ పౌర్ణమి నాడు జాతర ఉత్సవాలు జరుపుకొమ్మని చెప్పినందున ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి
చిరుమల్ల గ్రామంలో, మేడారం గ్రామంలో జరుపుకొనుట జరుగుచున్నది. కన్నుల పండుగగా జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవములో భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని 13/02/2025 గురువారం జరిగే శ్రీ సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం తిలకించి ఆ మహాపరాశక్తి గారి ఆశీస్సులు పొంది పరమానందాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుంటున్నాము..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!