ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆర్ఎంపీల మీద దాడులు చేసి కేసులు పెట్టి వేధిస్తున్నారు :మాజీ మంత్రి హరీష్ రావు

ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు.          ఆధాబ్ న్యూస్, ప్రతినిధి:
రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపిస్తున్నాయి
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు
ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన్రు
రాహుల్ గాంధీని తీసుకు వచ్చి హామిలిప్పించారు
సోనియా గాంధీతో లెటర్లు రాయించారు. హామీలన్నీ ఏమయ్యాయి
11 సార్లు ఢిల్లీ పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి

పోతున్నడు వస్తున్నడు కానీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ రేవంత్‌కు లేదు
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాడులు లేవు, కేసులు లేవు
కాంగ్రెస్ హయాంలో ఏ రాత్రి ఎవరు వస్తరో, ఎట్ల అరెస్టులు చేస్తరో తెలయని పరిస్థితి

ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారు
ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు
కేసులు పెట్టి బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు
ఆర్ఎంపీలను రోడ్ల మీదకు తెచ్చారు.రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి తక్షణం స్పందించి ఆర్ఎంపీలపై కేసులు పెట్టకుండా చూడాలని, ఎన్నికల హామీలో చెప్పినట్లు ట్రైనింగ్ ఇప్పించాలని, సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం
బీఆర్ఎస్ హయాంలో మీకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తే, కొందరు స్టేలు తెచ్చారు
నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే, స్టేలు తెచ్చారు
స్టేలు తెచ్చినా మేం మీ బతుకు దెరువు ఎక్కడా ఆపలేదు

మీ మీద కేసులు పెట్టలేదు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పలేదు
కాంగ్రెస్ వాళ్లు వచ్చినంక అందరి బతుకులు రోడ్డున పడ్డయి అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!