ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన.

పినపాక ఆధాబ్ న్యూస్ :
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తహశీల్దార్ అద్దంకి నరేష్ , డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్య బ్యాటింగ్‌లో భాగంగా అడుగుపెట్టడం విశేషం.
టోర్నమెంట్‌లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్యాట్స్‌మన్ పిచ్చయ్య (ప్రభాకర్) హాఫ్ సెంచరీ పూర్తి చేసి, తన అద్భుతమైన ఆటతీరు ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా, తహశీల్దార్ అద్దంకి నరేష్ , డిప్యూటీ తహశీల్దార్ సమ్మయ్య , ఎంపివో వెంకటేశ్వరరావు , ఎఫ్ ఆర్వో ఉపేంద్ర, ప్రెస్ క్లబ్ మిత్రులు నాగేందర్, సుధాకర్, భరత్  కలిసి పిచ్చయ్యకు పురస్కారాన్ని అందజేశారు.
క్రీడాభిమానులను ఆకట్టుకున్న ఈ మ్యాచ్ క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ శాఖల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!