ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బిపిఎల్ కార్మిక సంఘం ఎన్నికల్లో టిఎన్టియుసి ఘన విజయం.

బిపిఎల్ కార్మిక సంఘం ఎన్నికల్లో టిఎన్టియుసి ఘన విజయం.

పినపాక, ఆధాబ్ న్యూస్ : బిపిఎల్‌లో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టిఎన్టియుసి (TNTUC) ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చందా మధు హర్షం వ్యక్తం చేశారు.
టిఎన్టియుసి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విజయంతో ప్రేరణ పొంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పినపాక నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ పినపాకలో గట్టి పట్టున్న పార్టీ అని మరోసారి రుజువైనదని, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చందా మధు అన్నారు. టిఎన్టియుసి నేత కనకమెడల హరి ప్రసాద్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్