ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ములుగు జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు.

ఆధాబ్,న్యూస్ ,ములుగు:
ములుగు జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ బలరాం నాయక్, మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ శబరిస్, జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోడ్డు భద్రత పై అవగాహన పెంచే సందేశాలతో పాటు, వినోదాత్మకంగా ఏర్పాటు చేసిన డాన్స్ ప్రదర్శనలో మంత్రులు, జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. ఎంపీ బలరాం నాయక్, మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ శబరిస్, జిల్లా కలెక్టర్ దివాకర్ స్టేజ్ పై స్టెప్పులు వేయడం ప్రజలను ఆకర్షించింది. రోడ్డు భద్రతపై పలు సూచనలు అందజేశారు.
ఈ సంద్భంగా
జిల్లా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించడం ఎంతగానో అవసరం” అని అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రజల అవగాహనతోనే రోడ్డు భద్రతకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొనవచ్చు” అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!