ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భట్టుపల్లిలో ప్రజాపాలన గ్రామసభ.

కరకగూడెం ,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రిపబ్లిక్ డే నాటికి ఇళ్లను, రేషన్ కార్డులను అందించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పంపిణీ నిరంతర ప్రక్రియ అని పేరు రాని వాళ్ళు నిరుత్సాహం అవసరం లేదని అన్నారు. ఈ నియోజకవర్గంలో సంవత్సరానికి 3,500 ఇళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, ప్రభుత్వ పథకాలు పేదలకు చేరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ
కార్యక్రమంలో కరకగూడెం MRO నాగప్రసాద్, ఎస్సై రాజేందర్ , సీఐ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ స్థానిక నేతలు, మండల అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!