ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ నిత్యం అండగా . తిర్లాపురం, మల్లారం, పిట్టతోగు గ్రామాల్లో మెగా వైద్య శిబిరం నిర్వహణ

ఆధాబ్ న్యూస్, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్లాపురం, మల్లారం, పిట్టతోగు గ్రామాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. శిబిరానికి 65 కుటుంబాలకు చెందిన 300 మందికి పైగా ఆదివాసీలు హాజరయ్యారు.
జిల్లా ఎస్పీ దట్టమైన అడవుల మార్గంలో కిష్టాపురం గ్రామం నుండి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి పిట్టతోగు గ్రామాన్ని చేరుకున్నారు. అనంతరం మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి, వలస గుత్తి కోయ ప్రజల సంక్షేమానికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. విద్య, వైద్య మరియు రవాణా సౌకర్యాలు అందించేందుకు పోలీసులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారని తెలిపారు.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ఆదివాసీల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక అనేక మంది లొంగిపోతున్నారని ఎస్పీ చెప్పారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సహాయ సామగ్రి పంపిణీ:
కార్యక్రమంలో గ్రామస్తులకు సోలార్ లైట్లు, దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు యువతకు వాలీబాల్ కిట్లు, స్కూల్ పిల్లలకు నోటుబుక్స్ అందజేశారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు:
మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రాజ్ కుమార్, రాజేందర్ తదితర పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్న.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!