మణుగూరు, ఆధాబ్ న్యూస్: నూతన సంవత్సర వేళలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని, నిబంధనలను పాటించడం అవసరమని స్పష్టం చేశారు. అలాగే అర్ధరాత్రి వేడుకలకు అనుమతులు లేవు,సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సీఆర్పీసీ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం.
అరుబయట డిజేలు, సౌండ్ సిస్టంలకు నిషేధం: ఎక్కువ శబ్దం చేసే పరికరాలను ఉపయోగించరాదని సూచించారు.
అల్లర్లకు తావు లేదు: గుంపులుగా చేరి రోడ్లపై అల్లర్లు చేయడం, వాహనాలపై కేకలు వేస్తూ తిరగడం పూర్తిగా నిషేధమని తెలిపారు.
గస్తీ ముమ్మరం డిసెంబర్ 31న సాయంత్రం 5 గంటల నుంచే పోలీసు తనిఖీలు తీవ్రంగా జరుగుతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని, అనవసరమైన చిక్కులకు దూరంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులందరికి పిలుపు మీ పిల్లల కదలికలపై కఠినమైన నిఘా పెట్టాలని, వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు.
క్షణిక ఆనందం కోసం నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు తలెత్తొచ్చు. ఇది మీ కుటుంబానికి నూతన సంవత్సరం చేదు జ్ఞాపకంగా మిగిలే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అందరూ నిబంధనలు పాటించి, 2025 నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం,” అని డీఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు!









