ప్రతి క్షణం
ప్రజల పక్షం

  102 నూతన అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం.

102 నూతన అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం.
ఆధాబ్ న్యూస్,కరకగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు DMHO భాస్కర్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కారం మధు ఎమ్మెల్యే, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయించాలంటే గత ప్రభుత్వం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఏదైనా ప్రమాదానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లే విధంగా అంబులెన్స్ లను కేటాయించారని తెలిపారు.
ప్రవేట్ హాస్పిటల్ లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందిస్తూ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వైద్య అవసరం వచ్చిన ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, వెళ్లే అవసరం లేకుండా మన ప్రాంతంలోనే మెరుగైన వైద్యం అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి DMHO భాస్కర్ నాయక్ ,కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్ మెడికల్ ఆఫీసర్ కారం మధు ,కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ , తాజా మాజీ ఎంపీటీసీలు,సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!