ప్రతి క్షణం
ప్రజల పక్షం

  APGVB బ్యాంక్ విభజన ప్రక్రియలో సాంకేతిక సమస్యల వల్ల బ్యాంకింగ్ సేవలు.తాత్కాలిక అంతరాయం

ఆధాబ్ న్యూస్ ,
భారత ప్రభుత్వం, ఆర్థిక సేవల శాఖ (DFS), ద్వారా జారీ చేసిన లేఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB), తమ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య 01.01.2025 నుండి విభజించనుంది. APGVB కు చెందిన 493 శాఖలు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) లో విలీనం అవుతాయి.

విభజన ప్రక్రియలో సాంకేతిక సమస్యల వల్ల 28.12.2024 నుండి 31.12.2024 బ్యాంకింగ్ సేవలు (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్) అందుబాటులో ఉండవు అయితే తాత్కాలిక అంతరాయం ఉంటుందనే దృష్ట్యా, ముందుగానే మీ లావాదేవీలను ప్రణాళిక చేసుకోవాలని మనవి.

తెలంగాణ ప్రాంతం కస్టమర్లకు మార్గదర్శకాలు:
•మన బ్యాంక్ శాఖలు ఇప్పటివరకు ఉన్న స్థానాల్లోనే కొనసాగుతాయి.
•మీ ఖాతా నంబరు మారదు.
•APGVB UPI నుండి డీ-రిజిస్టర్ చేయండి.TGB పేరుతో మళ్లీ UPI రిజిస్టర్ చేసుకోండి.
•V-మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ను అన్ఇన్స్టాల్ చేయండి మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయండి.
•ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు దయచేసి TGB ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకోండి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!