మేకలు మీద దాడి చేసిన పెద్ద పులి తస్మాత్ జాగ్రత్త
ఆధాబ్ న్యూస్,కరకగూడెం:
కరకగూడెం మండలం పరిధిలోని రఘునాథ పాలెం గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతం లో బుధవారం పులి సంచరించినట్లు పశువుల కాపరులు తెలిపారు. పాల ఓర్రెలు, అందుగుల మీది , ఇసుక మీది అటవీ ప్రాంతం లో కొమరం నర్సయ్య మేకల మీద పులి దాడి చేయడం జరిగిందని కాపరులు తెలిపారు.
వెంటనే దగ్గర లో ఉన్న పశువుల కాపరులు, మేకల కాపరులు గోల చేయడం తో అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి పోయిందని అన్నారు.. అంతే కాకుండా అటవీ అధికారులు గ్రామస్తులను 10 రోజుల వరకు అటవీ ప్రాంతం లోకి మేకలను, పశువులను తీసుకొని వెళ్లొద్దు అని అటవీ అధికారులు గ్రామంలో చాటింపు వేయించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Post Views: 69









