ఎస్సై . రాజ్ కుమార్. ఆధాబ్ న్యూస్,పినపాక :పినపాక మండలంలోని జనంపేట శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించిన ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానకరంగా ఉన్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఎవరైనా అనుమానస్పదంగా కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని అన్నారు. మావోయిస్టు కార్యక్రమాలకు ఎవరు సహకరించవద్దని ఈ సందర్భంగా తెలిపారు.
Post Views: 140









